Thursday, January 6, 2011

Telangana Issue (తెలంగాణ సమస్య)

ఈ రోజు జస్టిస్ శ్రీక్రిష్ణ కమీషన్ నివేదిక  ప్రజలందరికి బహిర్గితం చేసారు.


కొంత మంది తెలంగాణవాదులు నమ్మబలుకుతున్నట్లు ఇది అభివ్రుధ్ధి సమస్య  కాదని అంకెలతో ఋజువయింది. వారి రిపోర్ట్ లో, ప్రాంతాల వారి అంకెలని పరిశీలించినట్లయితే, గత 50 ఏళ్ళలో సమైఖ్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతనికి ఎటువంటి తీరని అన్యాయం జరగలేదని, హైదరాబాదు రాష్త్రంగా వున్న కాలంతో పొల్చినా, సీమాంధ్రలతో సరిసమనంగా, రాయలసీమ కన్నా భేష్షుగ్గా అభివ్రుధ్ధి జరిగినట్లు అవగతం అవుతోంది.


ఇక తెలంగాణవాదులు అందుకొన్న రెండవ పల్లవి. 'ఆత్మగౌరవం', 'స్వయంపరిపాలన '. ఈ ఆత్మగౌరవం, యాస వేరు అనే సాకులు, భావోద్గాలకి మన రాజ్యంగంలో చోటుందా?  రేపు తెలంగాణ రాష్ట్రమే  ఏర్పడిన తర్వాత, యే అదిలాబాదు జిల్లవారో మరొకరో, మా ఆత్మగౌరవం దెబ్బతింటొంద, మాకో రాష్ట్రం కావలంటే ఎం చేస్తాము? ఈ ఆత్మగౌరవ వాదన పూర్తిగా పసలేనిదని నా అభిప్రాయం.


--------------------------------------------------------
అసలు ఈ సమస్యకు నాకు మూడు ప్రధాన కారణలు కనిపిస్తున్నయి.


1) రాష్ట్రంలో, కాని దేశంలో కాని రాజకీయలలో  నిజమయిన నాయకులు (statesmen) ఈ రోజు లేరు. అసలయిన నాయకులు, తన అనుచరులకి మరియు ప్రజలకి, ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్భయంగా చెప్పగలగాలి, తార్కింగా ఒప్పించగలగాలి. ఇప్పుడు మనకు వున్న నాయకులు కేవలం స్వార్థపరులు, కుహునావాదులు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం.


2) KCR & co లాంటి పబ్బం గడుపుకొందాం అనుకొనే వారు. మనలో ఇంకా చాల మంది స్వాతంత్రయం వచ్చి ఇన్నాలయిన, గొర్రెలమే. అందుకే rationale/logic లేకుండ emotionsకి స్వింగ్ అవుతున్నాం ఇంకా.


3) Congress or party in power (state and central). వీరి గోడ మీద పిల్లి వాటం, అహ నాకేంటి ? అనుకొనే సంకుచిత రాజకీయమే ఇంతవరకు తెచ్చింది. ముందు ఇస్తాం అని ఆ రొజు గడిపేసి, తీరా పీకల మీదకొచ్చాక మీనమేషాలు లెక్కేడ్తూ ఇప్పటికీ, వారి వైఖరి స్పష్టం చెయ్యకుండా ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు.


Noted MLC Nageswara Rao గారు, ఈ రోజు ఒక TV  channel discussion లో, Central govt.  ప్రస్తుతం ఈ Commission report ఇంకా తాత్సారం చెయ్యటం, Congress party తన అభిప్రాయం చెప్పకుండ, రాష్ట్రంలో మిగత parties opinion/stand అడగటాన్ని, చమత్కారంగా ఇలా  ఉదహరించారు.Congress govt.  చర్య ఎలా వుందంటే, ఒక traffic constable కూడలిలో వెళ్ళే జనలను యే signal (read as which of 6 formulas) వెయ్యమంటారు అని అదిగినట్లు వుంది. వారి పనిని వేరేవారిని చెయ్యమనటం, ఎంతవరకు సమంజసం అని !


--------------------------------------------------------
ఈ తెలంగాణా సమస్యలో మధ్యలో నలిగేది సామన్యుడు. నాకు ఈ గొడవలు వద్దు, ఈ చర్చ, ఈ ప్రక్రియ వళ్ళ నాకు ఒరిగేదేం లేదు, నన్ను వదిలెయ్యండి అని వేడుకొంటున్నా పట్టించుకోనే నాథుడే లేడు. ఈ circus గోలలొ ఎవరి వేషాలు వారివి. అసలు సమస్యలు దేవుడికెరుక.


--------------------------------------------------------
Note: I was born in Hyderabad and brought up in interiors of Telangana. Still I stand for united AP as separate statehood doesnt have any merit for general public, in my opinion.

No comments: